Wednesday, May 7, 2025
- Advertisement -

భార‌త్‌కు బిగ్ షాక్‌….మూడు వికెట్లు డ‌మాల్‌

- Advertisement -

240 పరుగుల లక్ష్యంతో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆరంభించారు. ఆదిలోనె భార‌త్‌కు బిగ్ షాక్ త‌గిలింది. టాప్ ఆర్డ‌ర్‌లో రోహిత్‌, విరాట్, రాహుల్‌ వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. స్పీడ్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కివీస్ బౌల‌ర్లు చెల‌రేగుతున్నారు. 240 ర‌న్స్ టార్గెట్‌తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన‌ ఇండియా.. న‌త్త‌న‌డ‌క‌న బ్యాటింగ్ చేస్తున్న‌ది. ముగ్గురు మేటి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయిన భార‌త్ మాంచెస్ట‌ర్‌లో ఎదురీదుతున్న‌ది.

ఓపెనర్ రోహిత్ శర్మ (1)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మను మాట్ హెన్రీ అవుట్ చేయగా, కోహ్లీని ట్రెంట్ బౌల్ట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. డీఆర్ఎస్ లో కూడా కోహ్లీ అవుట్ అని తేలడంతో టీమిండియా శిబిరం నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 1 పరుగుకే అవుటయ్యాడు. ప్రస్తుతం 4 ఓవర్లు పూర్తి కాగా టీమిండియా స్కోరు 3 వికెట్లకు 5 పరుగులు. క్రీజులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -