విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి సౌతాఫ్రికాతో భారత జట్టు తొలి టెస్టులో తలపడనుంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి వన్డే విశాఖలో జరగనుంది. ఇప్పటికే కోహ్లీసేన విశాఖ చేరుకుంది.కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అగ్రశ్రేణి క్రికెటర్లు వైజాగ్‌కి చేరుకోగా.. విజయనగరంలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ కూడా టీమ్‌తో కలిశాడు.దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన మూడు టీ20 సిరీస్‌ని 1-1తో సరిపెట్టిన టీమిండియా.. మూడు టెస్టు సిరీస్‌ని మాత్రం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.నాలుగేళ్ల క్రితం ఆఖరిగా భారత్‌లో పర్యటించిన సఫారీలపై అప్పట్లో ఆధిపత్యం చెలాయించిన భారత్ జట్టు 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. తాజాగా ఇరుదేశాల ఆటగాళ్లు సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. హెడ్‌కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో సీనియర్ పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ బౌలింగ్ సాధన చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.
- Advertisement -
విశాఖ చేరుకున్న కోహ్లీసేన….
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -