బుర్ర వాడి బంతులేయండయ్యా…రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ

మైదానంలో కెప్టెన్ కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటారో ….వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ మాత్రం మైదానంలో కూల్ గా ఉంటారు. ఆటగాళ్లపై కోప్పడిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ ఏ ఆటగాడికైనా చెప్పాలకున్నా కూల్‌నే విషయాన్ని చేరవేస్తాడు. కానిఫీల్డ్‌లో ఎప్పుడూ కూల్‌గా ఉండే రోహిత్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు.ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో రోహిత్‌ టెంపర్‌ను కోల్పోయాడు. విరాట్‌ కోహ్లి ఫీల్డ్‌ను విడిచి వెళ్లిన సమయంలో రోహిత్‌ తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. ఇదే సమయంలో యువ బౌలర్ నవదీప్ షైనీపై కోప్పడ్డాడు.

ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలో 12వ ఓవర్‌ వేస్తున్న నవదీప్‌ సైనీ బ్యాక్‌ టు బ్యాక్‌ బౌండరీలు ఇచ్చాడు. అతడు వేసిన రెండు బంతుల్ని సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ బావుమా ఈజీగా బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో సైనీపై వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. కొంచెం బుర్ర వాడి బంతులేయమని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://twitter.com/BattingAtDubai/status/1176469027218059264