Monday, May 5, 2025
- Advertisement -

కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన మ్యాచ్ రిఫరీ…కొద్దిలో తప్పిన నిషేధం

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిషేధం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. సఫారీలతో జరిగి మూడో టీ20 లో దక్షిణాఫ్రికా బౌలర్ బురాన్ హెండ్రిక్స్‌ని భుజంతో ఢీకొట్టిన విరాట్ కోహ్లీ ఢీకొట్టాడు. ఐసీసీ నియమ నిబంధనల్ని ఉల్లఘించినట్లు మ్యాచ్ రిఫరీ తేల్చాడు. దీంతో అధికారికంగా విరాట్ కోహ్లీకి వార్నింగ్‌రాగా.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేరింది.

లెవల్-1 నిబంధన ప్రకారం.. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో క్రికెటర్ ఇతర ఆటగాళ్లని పట్ల ద్దేశ్యపూర్వకంగా వ్వవహరించడం నేరం. విరాట్ కోహ్లీ ఖాతాలో ఇప్పటికే రెండు డీమెరిట్‌ పాయింట్లు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య మూడుకి చేరింది.2018, జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సమయంలో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేరగా.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ సమయంలో అఫ్గానిస్థాన్‌పై ఆడుతూ అతిగా అప్పీల్ చేసి మరో పాయింట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. రెండేళ్ల వ్యవధిలో ఒక ఆటగాడి ఖాతాలో నాలుగు డీమెరిట్ పాయంట్లు చేరితే అతనిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధం విధించనున్నారు. కానీ.. మ్యాచ్ రిఫరీ వార్నింగ్‌తో సరిపెట్టాడు. రెండు డీమెరిట్ పాయంట్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒకటే ఇచ్చారు. దీంతో కోహ్లీ నిషేధం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -