Saturday, April 27, 2024
- Advertisement -

ట్రాన్స్‌జెండర్లు ఇకపై క్రికెట్ ఆడలేరు!

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండ్‌ ఆటగాళ్లను ఐసీసీ నిషేధించింది. ట్రాన్స్‌జెండర్లకు సంబంధించి ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి లింగమార్పిడి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన డేనియల్ మెక్‌గాహే ఐసీసీ తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో మహిళల అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అవకాశం లేదు. అయితే ఆయా బోర్డులు స్థానికంగా నిర్వహించే టోర్నీల్లో పొల్గొన వచ్చని అది ఆయా బోర్డుల నిర్ణయానికే వదిలేస్తున్నామని ఐసీసీ తెలిపింది.

ఐసీసీ ఆమోదించిన కొత్త నిబంధనల ప్రకారం, మగ నుండి ఆడగా మారిన ఏ ప్లేయర్ అయినా అంతర్జాతీయ టోర్నీలు ఆడటానికి వీలు లేదు. మెక్‌గేహే, 29 ఏళ్ల క్రీడాకారిణి, ఆస్ట్రేలియాకు చెందిన ఈ ప్లేయర్ 2020లో కెనడాకు వెళ్లి ఆ జట్టు తరపున ఆడుతోంది. ఇప్పటివరకు ఆమె ఆరు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 19.66 సగటుతో మరియు 95.93 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేసింది. అలాగే బ్రెజిల్ మహిళల కెప్టెన్ రాబర్టా మోరెట్టి అవేరీ, మెక్‌గేహే రెండు T20I ఆడారు.

అయితే కొంతమంది క్రీడాకరిణీలు ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా మరికొంతమంది మాత్రం వ్యతిరేకించారు. దాదాపు 9 నెలల పాటు అందరిని సంప్రదించిన తర్వాత ఐసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకోగా ఉమెన్స్‌ క్రికెట్‌ను కాపాడటం, క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఐసీసీ వెల్లడించింది. అయితే రెండేళ్ల తర్వాత దీనిపై తిరిగి సమీక్షిస్తామని వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -