- Advertisement -

గౌహతి టెస్టుకు భారత్ సిద్ధం!

- Advertisement -

దక్షిణాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలిటెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా సందిగ్దంగానే ఉంది. అయితే గౌహతి టెస్టు కోసం ఇప్పటికే ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నం అయ్యారు.

మిడిల్-ఆర్డర్ బ్యాటర్లు రెండు గంటలకు పైగా నెట్స్‌లో గడిపారు. ఈ సమయమంతా సాయి సుదర్శన్ చురుకుగా పాల్గొన్నాడు. కోల్‌కతా మ్యాచ్‌లో, వాషింగ్టన్ సుందర్ నెం.3 స్థానంలో తన టెక్నిక్‌తో మెరుగ్గా కనిపించి, స్పిన్నర్లపై ఓపిక చూపడంతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. సుదర్శన్ తిరిగి జట్టులోకి రావాలంటే, ప్రస్తుతానికి శుభమాన్ గిల్ ఆరోగ్య పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుంది.

భారత కెప్టెన్ గిల్ నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ మెడపట్టీ ధరించి కనిపించాడు. నాలుగు రోజుల్లో అతను మైదానంలోకి అడుగు పెట్టగలడా అనేది ఇంకా చూడాలి. సుందర్ దాదాపు 30 నిమిషాలు రవీంద్ర జడేజా మరియు ధ్రువ్ జురెల్‌లకు బౌలింగ్ చేశాడు. తొలి టెస్ట్‌కు ముందు జరిగిన సెషన్స్‌లో సుదర్శన్ ఫ్రంట్ ఫుట్ ప్లేపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపించింది. ఇప్పుడు కూడా అదే విధంగా మొదలుపెట్టి, ఆ తర్వాత ఇతర షాట్లను కలిపి ఆడాడు. త్వరలోనే జురెల్ కూడా సుదర్శన్‌తో కలిసి బ్యాటింగ్ చేయగా, జడేజా త్రోడౌన్స్ కోసం గ్రౌండ్ అంతా తిరిగాడు.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ నెట్స్ వద్దకు వచ్చి బ్యాటర్ల వెనుక నుండి ఆటను పరిశీలించారు. ఇక భారత్ బుధవారం గౌహతికి చేరుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -