ఉప్పల్‌లో జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. వంద పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. 237 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. రెండో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతినే శిఖర్ ధవన్ పాయింట్ దిశగా డ్రైవ్ చేస్తూ మాక్స్‌వెల్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ రోహిత్ కోహ్లీతో కలసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అయితే కోహ్లీ (44) అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(37)ను కౌల్టర్ నైల్ పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత అంబటి రాయుడు 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ధోని 9 పురుగుల, కేదార్ జాదవ్ 15 పరుగులతోను ఆడుతున్నారు. టీమిండియా ప్రస్తుతం 30 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పో 123 పరుగులతో ఉంది.
- Advertisement -
కష్టాల్లో టీమిండియా….
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -