ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సమరానికి కోహ్లీసేన సిద్ధమైంది. ముందుగా రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారమే విశాఖపట్నంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో విజయం సాధించిన టీమిండియా జట్టు టీ20 సిరీస్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. టీ-20 సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్ , ఇప్పుడు టీ-20 సిరీస్‌ను కూడా తమ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కివీస్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ కోహ్లి, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి బరిలోకి దిగుతుండటంతో భారత జట్టు మరింత పటిష్టంగా మారింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ఈ సిరీస్‌కే దూరం అయిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ , ధావన్, కోహ్లీ,ధోని, కార్తిక్ వంటి బ్యాట్స్‌మెన్స్‌తో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. భూవనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి వారితో పేస్ కూడా బాగానే ఉంది. అటు ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్‌లో విజయం సాధించి, ప్రపంచకప్‌కు సన్నద్దం కావాలని భావిస్తోంది. విశాఖ గ్రౌండ్‌లో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Advertisement -
విశాఖ తీరంలో ఆసీస్‌తో తొలి టీ-20 సమరం నేడే…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -