ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా మొదట మ్యాచ్‌ని 19 ఓవర్లకు కుదించినట్లు ప్రకటించారు. భారత్ లక్ష్యాన్ని 137 పరుగులుగా నిర్దేశించారు. వరణుడు శాంతించక పోవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా 11 ఓవర్లలో 90 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.
ఇరు జట్ల ఆటగాల్లు ఆడేందుకు సిద్దంగా ఉండగా మరోసారి వర్షం రావడంతో చివరికి 5 ఓవర్లలో 46 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయినా వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా అసలు చేజింగ్ మొదలుపెట్టక ముందే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో సిరీస్ 1-0 ఆధిక్యంలో ఉంది అసిస్.
Sadly, the play has been called off at the MCG. Australia take a 1-0 series lead with one more game to go.#AUSvIND pic.twitter.com/C3b9iKxNM2
— BCCI (@BCCI) November 23, 2018