పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్రస్తుతం హనుమ విహారి( 24), రిషబ్ పంత్(9) క్రీజ్‌లో ఉన్నారు. మంగళవారం ఐదో రోజు ఆటలో విహారి-పంత్‌లు భారీ భాగస్వామ్యం సాధిస్తే కానీ భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం.
భారత్ విజయానికి ఇంకా 175 పరుగులు అవసరం కాగా, చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి.వీరిద్దరు తరువాత వచ్చే వారు అందరు బౌలర్లు కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.మంగళవారం ఐదో రోజు ఆటలో విహారి-పంత్‌లు భారీ భాగస్వామ్యం సాధిస్తే కానీ భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. భారత్ కోల్పోయిన ఐదు వికెట్లలో లయన్, హజల్‌వుడ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌కు వికెట్ దక్కింది.
- Advertisement -
గెలుపు ముగింట ఆసీస్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -