Monday, May 5, 2025
- Advertisement -

కోహ్లీపై ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించిన ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్

- Advertisement -

ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ఆరు వ‌న్డేల సిరీస్‌లో 5-1 తేడాతో అద్భుతంగా విజ‌యం సాధించి సీరీస్‌ను కైవ‌సం చేసుకుంది. చిరివ‌న్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆయనపై విదేశీ క్రికెటర్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పాకిస్థాన్‌లో కూడా కోహ్లీకీ అభిమానులున్నారు. తాజాగా విరాట్‌ని కొనియాడుతూ… ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసి అలరించాడు.

ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్‌:అని ఆయన ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. చివరకు అత్యద్భుతమని అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా టెస్టుల్లో ఓడినప్పటికీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలోనే ఉంది. అంతేకాక, వన్డేల్లో గెలిచి సౌతాఫ్రికాను వెనకేసి అందులోనూ టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియాకు ఘన విజయాలను అందిస్తోన్న కోహ్లీ ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -