Sunday, May 4, 2025
- Advertisement -

విండీస్ మ్యాచ్‌లోధోని రికార్డును రోహిత్ బ‌ద్ద‌లు కొడ‌తాడా…?

- Advertisement -

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును నెల‌కొల్పేందుకు రెండు సిక్స‌ర్ల దూరంలో ఉన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. విండీస్‌తో జ‌రిగే మ్యాచ్‌లో రోహిత్ రెండు సిక్స‌ర్లు బాదితే ధోని రికార్డు బ‌ద్ద‌ల‌వుతుంది.

210 వన్డేలు ఆడిన రోహిత్‌ ఇప్పటివరకు 224 సిక్సర్లు బాదాడు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఖాతాలో 225 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది(351 సిక్సర్లు), వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌(324 సిక్సర్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో రికార్డు మిస్సయ్యాడు. 250 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో టాప్‌-5లో నిలిచిన ఒకే ఒక్కడు రోహిత్‌ కావడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లో కొనసాగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -