Friday, May 9, 2025
- Advertisement -

కోహ్లీ రికార్డును బ్రేక్ చేయ‌నున్న రోహిత్‌…

- Advertisement -

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర‍్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు.

భారత్-వెస్టిండిస్‌ల మద్య మంగళవారం లక్నోలో రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. విరాట్‌కు విశ్రాంతి ఇవ్వ‌డంతో తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కోహ్లీ టీ20 లో సాధించిన అరుదైన రికార్డు రోహిత్ కేవలం 11 పరుగుల దూరంలో నిలిచాడు. అయితే టీ20 సీరిస్ నుండి కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్ లో అతడి రికార్డు ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

మరో 11 పరుగులు చేస్తే కోహ్లి(2,102)ని రోహిత్‌ అధిగమిస్తాడు. ప్రస్తుతం 2,092 పరుగులతో ఉన్న రోహిత్‌ శర్మ.. వెస్టిండీస్‌ జరుగునున్న రెండో టీ20లో కోహ్లిని దాటే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -