Friday, May 9, 2025
- Advertisement -

గంగూలి టెస్ట్ రికార్డు చేరువ‌లో భార‌త జ‌ట్టుకేప్టెన్ విరాట్ కోహ్లీ….

- Advertisement -

భార‌త జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్న జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రికార్డుకూడా శ్రీలంక‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ తోనె సాధ్య‌మ‌వుతుంది. భార‌త త‌రుపున అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒక‌రైన గంగూలీ రికార్డును తిర‌గ‌రాసేందుకు విరాట్ సిద్ద‌మ‌వుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌రుపున అత్య‌ధిక టెస్టు మ్యాచ్ అత్యధిక టెస్టు విజయాలు సాధించిన సారథి ఎంఎస్‌ ధోనీ. ఆయన 60 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 27 మ్యాచుల్లో జట్టు గెలిచింది. ఇక గంగూలీ 49 మ్యాచ్‌లకు 21 విజయాలు సాధించాడు. ప్రస్తుత నాయకుడు కోహ్లీ 29 టెస్టులకు నేతృత్వం వహించగా గెలిచింది 19 మ్యాచులు. అంటే మరో రెండు టెస్టులు గెలిస్తే దాదా ఘనతను కోహ్లీ సమం చేస్తాడు. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన శ్రీలంక మూడు టెస్ట్‌లు ఆడ‌నుంది. మూడు టెస్ట్‌ల‌ను క్లీన్‌స్విప్ చేస్తె విరాట్ రికార్డు మ‌రింత మెరుగ‌వుతుంది.

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌ ఇలా అన్ని విభాగాల్లో కోహ్లీసేనకు తిరుగులేదు. ఇంతకు ముందే శ్రీలంకను దాని సొంతగడ్డపై వరుసగా ఐదు టెస్టుల్లో ఓడించి సిరీస్‌ స్వీప్‌ చేసింది. ఇప్పుడు అదే జట్టు భారత్‌లో అడుగు పెట్టింది. స్వదేశంలో తిరుగులేని దూకుడు కనబరుస్తున్న టీమిండియాకు స్వీప్‌ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే ప్రతీకారంతో రగిలిపోతున్న లంకేయులు ఈ సారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందే పాక్‌ను 2-0తో స్వీప్‌ చేసి ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -