Saturday, May 10, 2025
- Advertisement -

స్మిత్‌, వార్న‌ర్‌ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..

- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్ వివాధంలో వార్న‌ర్‌, డేవిడ్‌ల‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు వారిపైన నిషేధం విధించిన వెంట‌నే బీసీసీఐ కూడా వారికి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ 2018లో ఆడే అర్హత లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. స్మిత్, వార్నర్‌లు రెండేళ్లపాటు జట్టు పగ్గాలు చేపట్టకుండా ఆసీస్ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నిర్ణయంతో బీసీసీఐ కూడా అదే రీతిలో స్పందించింది.

. ట్యాంపరింగ్ వివాదం కారణంగా రాజస్థాన్ కెప్టెన్సీ నుంచి స్మిత్, సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి వార్నర్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే స్మిత్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ రహానేను కెప్టెన్‌గా ప్రకటించగా.. సన్‌రైజర్స్ నూతన సారథిని ఎంపిక చేయాల్సి ఉంది.

ఈ ఏడాది భారత జట్టు ఆసీస్ గడ్డ మీద పర్యటించనుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం కారణంగా వార్నర్, స్మిత్ భారత్‌తో సిరీస్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ నాటికి వీరిద్దరూ జట్టులో చేరతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -