Thursday, May 8, 2025
- Advertisement -

ఐపీఎల్ 2018 ప్రమోషనల్ సాంగ్ వ‌చ్చేసింది….

- Advertisement -

ఐపీఎల్ 2018 హంగామా మొద‌ల‌య్యింది. ఏప్రిల్ 7న వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా తాజాగా బీసీసీఐతో కలిసి బ్రాడ్‌కాస్టర్ ‘స్టార్ ఇండియా’ ఓ ప్రమోషనల్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘బెస్ట్ VS బెస్ట్’ పేరుతో విడుదలైన ఈ గీతం క్రికెట్ అభిమానుల్ని అలరిస్తోంది. ఈ సాంగ్‌ని హిందీ, తమిళం, బెంగాలీ, కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల చేశారు.

సుదీర్ఘకాలంగా ఒకే జట్టుకి ఆడుతున్న చాలా మంది క్రికెటర్లు.. ఇటీవల జరిగిన వేలంలో వేరొక జట్టుకి మారడం, రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమం చేస్తున్నాయి. కొత్త కెప్టెన్లు, సరికొత్త హిట్టర్ల చేరికతో ఈ ఏడాది ఐపీఎల్‌ మరింత ఆసక్తికరంగా జరగనుంది.

2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ ఇప్పటికే పదేళ్లు పూర్తి చేసుకోగా.. గత ఏడాది ముంబయి ఇండియన్స్ టోర్నీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సాంగ్‌ విడుదలైన కొద్దిసేపటికే మహేంద్రసింగ్‌ ధోని ట్వీటర్‌ ద్వారా స్పందించారు. ఐపీఎల్‌ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, దానికి జోష్‌ తెచ్చేలా ప్రచారం ఉందన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -