Sunday, May 4, 2025
- Advertisement -

బ‌ట్ల‌ర్ జోష్ ….ప్లే ఆఫ్ ఆశ‌లు వ‌దులుకున్న ముంబ‌య్ ఇండియ‌న్స్‌…

- Advertisement -

ప్లేఆఫ్ ఆశ‌లు స‌జీవంగా ఉండాలంటే త‌ప్పక గెల‌వాల్సిన మ్యాచ్‌లో ముంబ‌య్ ఇండియ‌న్స్ ఘోరంగా ఓట‌మిపాల‌య్యింది. 2018 ఐపీఎల్ సీజ‌న్‌లో భాగంగా రాయ‌ల్‌ఛాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన ముఖ్య‌మైన మ్యాచ్‌లో ముంబ‌య్ ఓడి ప్లేఆఫ్ ఆశ‌లు దాదాపు వదులుకున్న‌ట్లే. రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌మాత్రం త‌మ ప్లేఆఫ్ ఆశ‌లను మెరుగుప‌రుచుకుంది.

ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ (81: 47 బంతుల్లో 8×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుగెలుపులో బ‌ట్ల‌ర్ మ‌రో సారి కీల‌క పాత్ర పోషించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఎవిన్ లూవిస్ (60: 42 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్య (36: 21 బంతుల్లో 3×4, 2×6), సూర్యకుమార్ యాదవ్ (38: 31 బంతుల్లో 7×4) నిలకడగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

ఛేదనలో ఓపెనర్ డీఆర్క్ షార్ట్ (4) తొలి ఓవర్‌లో ఔటైనా.. అనంతరం వచ్చిన కెప్టెన్ అజింక్య రహానె (37: 36 బంతుల్లో 4×4)తో కలిసి జోస్ బట్లర్ రాజస్థాన్‌‌ని గెలుపు బాట పట్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి అభేద్యంగా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. 13 ఓవర్లు ముగిసే సమయానికి రాజస్థాన్ 104/1తో తిరుగులేని స్థితిలో నిలిచింది. ఈ దశలో రహానె ఔటైనా.. అనంతరం సంజు శాంసన్ (13: 7 బంతుల్లో 2×4)తో కలిసి బట్లర్ గెలుపు లాంఛనాన్ని 17.5 ఓవర్లలో 167/2తో పూర్తి చేశాడు. దీంతో ప్లేఆఫ్ ఆశ‌ల‌ను మెరుగు ప‌రుచుకుంది రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -