తాజాగా ఐపీఎల సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చైన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది ముంబై ఇండియాన్స్. టోర్నిలో వరుస విజయాలు సాధిస్తున్న ధోని జట్టుకు అడ్డుకట్ట వేసింది రోహిత్ సేన. బుధవారం స్థానిక వాంఖెడే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై 37 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. ముంబై ఇండియాన్స్ మొదట బ్యాటింగ్ చేసి 170 పరుగులు చేసింది. సూర్యకుమార్(59), కృనాల్(42)లు ఆదుకున్నారు. మ్యాచ్ చివర్లో హార్దిక్ పాండ్యా(25), పొలార్డ్(17)లు మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. చైన్నై జట్టులో కేదార్ జాదవ్(58) మినహా ఎవరూ రాణించలేదు. ఐపీఎల్ 11 నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలు సాధిస్తు వస్తోంది చైన్నై జట్టు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేకు భంగపాటు తప్పలేదు.
- Advertisement -
చైన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చిన రోహిత్ సేన
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -