Monday, May 5, 2025
- Advertisement -

ప్లేఆఫ్స్‌కు కేకేఆర్‌

- Advertisement -

ఐపీఎల్‌-17లో ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది కోల్ కతా నైట్ రైడర్స్. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై..నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి139 పరుగులు మాత్రమే చేసింది.దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు.

ఇషాన్‌ కిషన్‌ 22 బంతుల్లో 40 పరుగులు చేయగా తిలక్‌ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 7 వికెట్ల నష్టానికి 157 పరుగలు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 21 బంతుల్లో 42 పరుగులు చేయగా నితీశ్‌ రాణా 23 బంతుల్లో 33 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది కేకేఆర్. వరుణ్‌ చక్రవరిక్తి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -