Monday, June 17, 2024
- Advertisement -

తీన్మార్ కొట్టిన కోల్ కతా..

- Advertisement -

ఐపీఎల్ లో మూడోసారి విజేతగా నిలిచింది కోల్ కతా నైట్‌రైడర్స్. చెన్నై చెపాక్ వేదికగా సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది కోల్ కతా. హైదరాబాద్ విధించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలోనే చేధించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 26 బంతుల్లో 3 సిక్స్‌లు,4 ఫోర్లతో 52 నాటౌట్‌గా నిలవగా గుర్బాజ్‌ 39 పరుగులు చేశారు. కమిన్స్‌ 1/18, షాబాజ్‌ 1/22 వికెట్ తీశారు.ఈ విజయంతో పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకుంది కోల్ కతా.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ చేసిన హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఎవరి అంచనాలకు అందకుండా కేవలం 18.3 ఓవర్లలో 113 పరుగులకే చాప చుట్టేసింది. కమిన్స్‌ 24, మార్క్మ్‌ 20 పరుగులు చేయగా రస్సెల్‌ 3/19, స్టార్క్‌ 2/14 వికెట్లు తీశారు. స్టార్క్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

విజేత కోల్ కతాకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా రన్నరప్‌: హైదరాబాద్‌12.50 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది. నితీశ్‌కుమార్‌రెడ్డి రూ.10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు దక్కించుకోగా అత్యంత విలువైన ఆటగాడిగా నరైన్‌ ,ఆరెంజ్‌ క్యాప్‌: విరాట్‌ కోహ్లీ (741 రన్స్‌),పర్పుల్‌ క్యాప్‌: హర్షల్‌ పటేల్‌ (24 వికెట్లు) దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -