2020 తర్వాత ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించని హైదరాబాద్ ఈ సీజన్‌లో అద్భుత ఆటతీరును కనబర్చింది. ముఖ్యంగా ఎంత భారీ టార్గెట్ అయినా ఎస్‌ఆర్‌హెచ్ ముందు చిన్నబోవాల్సిందే. మంచి ఓపెనింగ్ జోడి, మిడిలార్డర్ పటిష్టంగా ఉండటం, అదృష్టం కూడా కలిసి రావడంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది హైదరాబాద్.
రెండో స్థానం కోసం జరిగిన పోరులో వరణుడు కరుణించడంతో హైదరాబాద్‌కు కలిసివచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ వర్షార్పణం కావడంతో రాజస్థాన్ ఆశలు అడియాసలయ్యాయి. దీంతో పాయింట్ల పట్టికలో అప్పటివరకు రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్ రద్దు కావడంతో మూడో స్థానానికి చేరింది. ఒకవేళ మ్యాచ్ జరిగి రాజస్థాన్ గెలిచి ఉంటే సెకండ్ ప్లేస్‌లోనే ఉండేది.
ఇక మే 21న ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో కోల్ కతా తలపడనుండగా 22న ఎలిమినేటర్ మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మధ్య జరగనుంది. ఫస్ట్ క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌తో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు మధ్య క్వాలిఫయర్ 2 ఉండనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌లో తొలి క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. సో రాజస్థాన్ ఒక వేళ రెండో స్థానంలో ఉంటే ఫస్ట్ క్వాలిఫయర్‌లో ఓడినా సెకండ్ క్వాలిఫయర్ ఛాన్స్ ఉండేది. కానీ వరణుడి రూపంలో ఆ జట్టుకు నిరాశే మిగిలింది.