Saturday, May 10, 2025
- Advertisement -

IPL 2025:టెన్షన్..ఐపీఎల్ మ్యాచ్ రద్దు!

- Advertisement -

భారత్ పాక్‌ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్‌ను రద్దు చేశారు.10.1 ఓవర్ల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే బీసీసీఐ మాత్రం… హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంలో సాంకేతిక సమస్య కారణంగా మ్యాచ్ రద్దయిందని తెలిపింది. ప్రాంతంలో విద్యుత్ సమస్య వల్ల HPCA స్టేడియంలోని ఒక లైట్ టవర్ పనిచేయకపోయింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి బీసీసీఐ విచారం వ్యక్తం చేస్తోంది అని ప్రకటన విడుదల చేసింది బీసీసీఐ.

దీంతో రెండు జట్ల ఆటగాళ్లు మరియు ప్రేక్షకులను స్టేడియం నుండి ఖాళీ చేయించారు. స్టేడియంలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా, పోలీసు మరియు స్టేడియం సిబ్బంది మెల్లగా బయటకు వెళ్లాలంటూ ప్రేక్షకులను కోరినట్లు తెలిసింది. ఎలాంటి తొక్కిసలాట లేకుండా ప్రేక్షకులు బయటకు వెళ్లేలా పోలీసులు రిక్వెస్ట్ చేశారు.

మ్యాచ్ రద్దుకు ముందు ధర్మశాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్ములో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోండగా మిగితా ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అన్న సందిగ్దం నెలకొంది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ మాట్లాడుతూ, శుక్రవారం లక్నోలో జరగాల్సిన LSG వర్సెస్ RCB మ్యాచ్‌పై నిర్ణయం ప్రభుత్వంతో చర్చల అనంతరం తీసుకుంటామని తెలిపారు.

వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్. పంజాబ్ ఓపెనర్లు ప్రభు, ప్రియాంశ్ .. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 10 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది పంజాబ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -