Saturday, May 3, 2025
- Advertisement -

విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్‌..?

- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి అహ్లావత్ విడిపోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 21 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెబుతూ విడిపోనున్నారని సమాచారం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

అంతేగాదు కొద్దిరోజులుగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని త్వరలో వీరు విడాకులు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇక గత సంవత్సరం దీపావళి వేడుకల సందర్భంగా సెహ్వాగ్ కొన్ని ఫొటోలు షేర్ చేయగా ఆ ఫొటోలలో ఆర్తి ఎక్కడా కనిపించలేదు. తన కుమారులు, తల్లితో మాత్రమే ఉన్న ఫొటోలను అతడు షేర్ చేశాడు. అలాగే ఇటీవల సెహ్వాగ్ కేరళలోని పాలక్కాడ్ విశ్వ నాగయక్షి ఆలయాన్ని సందర్శించగా అక్కడ ఫొటోలలోనూ ఆర్తి ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరి విడాకుల గురించిన వార్తలు గుప్పుమంటున్నాయి. 2000 సంవత్సరంలో ప్రేమలో పడ్డారు వీరిద్దరూ. నాలుగేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -