Sunday, May 4, 2025
- Advertisement -

ఇంగ్లాండ్ బౌలర్‌‌కి తప్పిన పెను ప్రమాదం

- Advertisement -

ఇంగ్లాండ్‌ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌కి పెద్ద ప్రమాదం తప్పింది.స‌రదాగా కాసేపు గోల్ఫ్ ఆడిన అండర్సన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అండర్సన్ కొట్టిన బంతి వేగంగా చెట్టుకి తగిలి మళ్లీ వెనక్కి వచ్చి అతని ముఖాన్ని తాకింది.

అయితే.. అండర్సన్‌కి ఎలాంటి గాయమవ్వలేదని.. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉన్నట్లు అతని సహచరుడు, ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. భారత్‌తో శనివారం ముగిసిన తొలి టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టిన అండర్సన్.. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -