ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. నిర్ణిత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 313 పరుగులు భారత్ ముందు ఉంచింది. ఫించ్(93), ఖాజా(104) పరుగులు సాధించి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. 314 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా 281 పరుగులకే అలౌట్ అయింది.
విరాట్ కోహ్లి(123) సెంచరీ సాధించినప్పటికి , జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. . చివర్లో విజయ్ శంకర్(32), రవీంద్ర జడేజా(24)లు మెరుపులు మెరిపిండంతో విజయంపై ఆశలు కలిగాయి.. కానీ చివరకు ఆసీస్‌నే విజయాన్ని వరించింది. ఆసీస్ బౌలర్లలో జంపా, కమిన్స్, రిజర్డ్‌సన్‌లు తలో మూడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించారు. ఐదు వన్డేల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను భారత్ గెలిచింది.
- Advertisement -
కోహ్లీ సెంచరీ వృధా..మూడో వన్డేలో ఓడిన భారత్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -