Saturday, April 27, 2024
- Advertisement -

ప్యాంట్ జారిపోతున్నా రనౌట్ కు ప్రయత్నించిన క్రికెటర్…

- Advertisement -

క్రికెట్ మైదానంలో ఒక్కోసారి అనుకోని సిల్లీ సంఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణం. ఫిల్డింగ్ సమయంలో ఆటగాళ్లు గాయాలు అవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుడా డైవ్ చేస్తుంటారు.ఫీల్డింగ్ సమయంలో ప్యాంట్ జారిపోతే..? అలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీలో చోటు చేసుకుంది.

ఆస్ట్రేలియాలో మార్ష్‌‌కప్‌లో భాగంగా వన్డే టోర్నమెంట్ జరుగుతుండగా.. తాజాగా క్వీన్స్‌లాండ్, విక్టోరియా జట్లు ఢీకొన్నాయి. ఈ మ్యాచ్‌లో క్వీన్స్‌లాండ్‌కి చెందిన ఫీల్డర్ మార్నస్ లబు‌ఛేంజ్ బంతిని నిలువరించేందుకు పక్కకి డైవ్ చేసి బంతిని అందుకొని కీపర్ కు వేగంగా త్రో చేశాడు.అప్పటికి విక్టోరియా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రాలేకపోవడడంతో రనౌటయ్యాడు. బంతిని అందుకొనే క్రమంలో ఫీల్డర్ మార్నస్ లబు‌ఛేంజ్ తన ప్యాంట్ జారిపోతున్నా ఏమాత్రం పట్టించుకోలేదు.బంతిని విసిరిన తర్వాత కీపర్ రనౌట్ చేసే వరకూ మార్నస్ అలానే నేలపై కూర్చుని ఉన్నాడు. ఆఖరిగా బ్యాట్స్‌మెన్ రనౌటని నిర్ధారించుకుని.. అప్పుడు తీరిగ్గా లేచి ప్యాంట్ సరిచేసుకుని సహచరులతో కలిసి వికెట్ సంబరాలు చేసుకున్నాడు.

https://www.instagram.com/p/B2_VhF1H_hi/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -