- Advertisement -

ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్‌..

- Advertisement -

సొంత అభిమానుల మధ్య వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్(59: 39 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), ఎవిన్ లెవిస్(43: 28 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ఆరంభంలో మెరుపు బ్యాటింగ్‌తో ముంబయిని పటిష్ఠస్థితిలో నిలిపారు

అయితే ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరంభంలోనే చిక్కుల్లో ప‌డింది. జట్టు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ క్రిస్‌లిన్ (17: 13 బంతుల్లో 4×4) ఆ ఓవర్‌లోని ఐదో బంతికి ఔటవగా.. తర్వాత ఓవర్‌ తొలి బంతికే శుభమన్ గిల్ (7: 5 బంతుల్లో 1×4) సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించి ఫీల్డర్ కృనాల్ పాండ్య చేతికి చిక్కాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి కోల్‌కతా 33/2తో ఇబ్బందుల్లో పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -