ఎంఎస్ ధోని ఈ పేరు ఇండియన్ క్రికెట్‌లో పెను సంచలనమే అని చెప్పాలి.ఇప్పటికే అనేక రికార్డులను సృష్టించిన ధోని మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో మూడొందల క్యాచ్‌లు పట్టిన తొలి టీమిండియా వికెట్ కీపర్‌గా ధోని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 37వ ఓవర్‌లో జాస్ బట్లర్ క్యాచ్ పట్టి వన్డేల్లో మూడొందల క్యాచ్‌ల మార్కును చేరాడు.
ఇది ధోనికి 320వ వన్డే.ఓవరాల్‌గా ఈ ఘనతెక్కిన నాలుగో వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. గిల్‌క్రిస్ట్ (417), బౌచర్ (403), సంగక్కర (402) ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని ధోని ఆక్రమించాడు.ఈ మ్యాచ్‌లోనే ధోని 10000 పరుగుల క్లబ్‌లో చేరాడు.10000 పరుగుల పూర్తి చేసుకున్న నాల్గో భారత ఆటగాడు ధోని.ధోని కన్నా ముందు సచిన్,సౌరవ్ గంగూలీ, ద్రవిడ్ 10000 పరుగులు పూర్తి చేశారు.