Friday, May 9, 2025
- Advertisement -

విరాట్ కోహ్లీ ఆర్మీకి ధోనీనే జనరల్…కుల్దీప్ యాద‌వ్‌

- Advertisement -

టీమిండియాను విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తూ స‌క్సెస్‌పుల్ కెప్టెన్‌గా దూసుకుపోతున్నారు. ఆట‌లో కెప్టెన్‌గా ఎంత‌టి ప్రాధాన్యం ఉందో అంతే రీతిలో ధోనీకి కూడా ఉంది. మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యూహాలు రచిస్తుంటే.. వాటిని వికెట్ల వెనుక నుంచి మహేంద్రసింగ్ ధోనీ అమలు చేస్తుంటాడని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు.

ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై ముగిసిన సుదీర్ఘ పర్యటనలో ఆరు వన్డేలాడిన కుల్దీప్ యాదవ్ 17 వికెట్లు పడగొట్టి భారత జట్టు సిరీస్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అయితే.. చివరి వన్డేలో గాయపడిన కుల్దీప్.. తర్వాత జరిగిన మూడు టీ20లకీ దూరమయ్యాడు. మంగళవారం నుంచి శ్రీలంక వేదికగా జరగనున్న ముక్కోణపు టీ20 టోర్నీ నుంచి కూడా ఈ మణికట్టు స్పిన్నర్‌కి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

ప్రస్తుతం ఫిటెనెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్ 2018 సీజన్‌కి తాను పూర్తిస్థాయిలో ఫిటెనెస్ సాధిస్తానని కుల్దీప్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ వేలంలో కుల్దీప్ యాదవ్‌ని రూ. 5.8 కోట్లకి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

మైదానంలో కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ సెట్ చేయడం, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎలా దాడి చేయాలో వ్యూహాలు రచిస్తుంటాడు. వికెట్ల వెనుక నుంచి మహేంద్రసింగ్ ధోనీ.. బౌలర్లతో కలిసి వాటిని అమలు చేసే బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ ఆర్మీకి ధోనీ జనరల్‌ లాంటివాడు. దాదాపు ప్రతి బంతికీ బౌలర్‌కు ధోనీ నుంచి సూచనలు, సలహాలు వస్తుంటాయి. కోహ్లి కూడా బౌలర్‌కి ఎక్కువ స్వేచ్ఛనిస్తుంటాడు. అందుకే నేను, చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఎదురుదాడి చేసేందుకు కూడా వెనకడుగువేయం’ అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -