Friday, May 9, 2025
- Advertisement -

కోహ్లీ కెప్టెన్సీ గురించి ధోనీ ఏమ‌న్నాడో తెలుసా…?

- Advertisement -

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారథుల‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఒక‌రు. జ‌ట్టు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలగురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. వికెట్ల వెనుక కూల్‌గా ఆలోచిస్తూ.. టీమిండియాను నంబర్ 1గా నిలిపిన ధోనీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. అతడి స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు. కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు విజయ పథంలో ముందుకెళ్తోద‌న‌డంలో సందేహంలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు వన్డే, టీ20 వరల్డ్ కప్‌లు నెగ్గిన ఏకైక కెప్టెన్ మహీనే. విరాట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ.. కీలక సమయాల్లో ధోనీ సలహాలను తీసుకుంటాడనే సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సెట్ చేయడంలో, బౌలర్లను సమర్థవంతంగా వాడుకోవడంలో మహీ తర్వాతే ఎవరైనా. అలాంటి ధోనీ మంచి కెప్టెన్ ఎలా ఉండాలనే విషయమై స్పందించాడు.

మంచి కెప్టెన్ వ్యక్తిగతంగా ఆటగాళ్లను అర్థం చేసుకోవాలి. వారి బలాలను, బలహీనతలు తెలియకపోతే వారికి తగిన సలహా ఇవ్వలేమని ధోనీ చెప్పాడు. ఇక కోహ్లీ కెప్టెన్సీ గురించి ఒక్క ముక్క‌లో తేల్చేశాడు ధోనీ. కోహ్లి కెప్టెన్సీ గురించి ప్రశ్నించగా.. హీ ఈజ్ వెరీ గుడ్ అంటూ సింపుల్‌గా బదులిచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -