Sunday, April 28, 2024
- Advertisement -

కొత్త లుక్ లో మహేంద్రసింగ్ ధోని..

- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ గ్రౌండ్ లోకి దిగారంటే తన విశ్వరూపం చూపిస్తారు. బ్యాట్స్ మెన్, సూపర్ కీపర్, సత్తా ఉన్న కెప్టెన్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారు ఎంఎస్ ధోని. ఆయన ఏది చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు.. ధోనికి ఉన్న జుట్టు కూడా ఎంతగానో ఆకట్టుకునేది.. ధోనీ స్టైల్‌ను చాలా మంది ఫాలో అవుతూ వచ్చారు.

తాజాగా ఎంఎస్ ధోని కొత్త లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఐపీఎల్2023 కోసం ప్రాక్టీస్ చేసేందుకు వచ్చిన మహేంద్రసింగ్ ధోని బ్లూ ట్రాక్ సూట్ ధరించి… తల్లటి గడ్డంతో కనిపించాడు. ధోనీ తో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. IPLలో చెన్నైకి 4 టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోని ఈసారి కూడా కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఈసారి కూడా మరోసారి కప్ అందిస్తాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -