Thursday, May 16, 2024
- Advertisement -

కొహ్లిపై ప్రముఖుల ప్రసంశలు

- Advertisement -

విరాట్ కొహ్లి. గత కొంతకాలంగా భారత క్రికెట్ అభిమానులు.. ఆమాటకొస్తే ప్రపంచ క్రికెట్ అభిమానులంతా స్మరిస్తున్న ఆటగాడు.  ఐపిఎల్ లో బెంగళూరు జట్టును ముందుండి నడిపిస్తున్న విరాట్ కొహ్లి ఈ సీజన్ లో చెలరేగిపోతున్నాడు. దీంతో మాజీ క్రికెటర్లు అతని ప్రతిభను వేయనోళ్ల పొగుతున్నారు. విరాట్ కొహ్లికి బౌలింగ్ చేయడం కష్టమని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అన్నారు.

కచ్చితమైన క్రికెట్ షాట్లు ఆడడమే కొహ్లి విజయరహస్యమని ఆయన అన్నాడు. విరాట్ కు బౌలింగ్ చేయడం ప్రపంచంలో ఏ బౌలర్ కైనా కష్టమేనని,  ఆమాటకొస్తే తనను బౌలింగ్ చేయమన్నా తాను ఆందోళన చెందుతానని అక్రం చెప్పారు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే విరాట్ ను ఆకాశానికెత్తాశాడు.

విరాట్ కొహ్లి సక్సెస్ కి కారణం అతని స్ట్రయిట్ బ్యాట్ టెక్నిక్ కారణమని సచిన్ అభిప్రాయపడ్డాడు. గల్ఫ్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ విరాట్ కొహ్లిలో క్రమశిక్షణ, నిబద్దత ఎక్కువ. అందుకే ఫార్మాట్ ఏదైన రాణిస్తున్నాడు అన్నాడు. శభాష్ విరాట్ కొహ్లి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -