- Advertisement -

పాక్‌తో ఆడ‌మ‌ని ఐసీసీ భార‌త్‌పై ఒత్తిడి చేయ‌కూడ‌దు…అక్ర‌మ్‌

- Advertisement -

భార‌త్‌-పాక్‌ల మ‌ధ్య సంబంధాలు క్షీనించ‌డంతో క్రికెట్ మ్యాచ్‌లు ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ ఇప్ప‌టికె అనేక సార్లు బీసీసీఐ విమ‌ర్శ‌లు చేసింది. పాక్‌తో మ్యాచ్‌లు ఆడ‌టానికి ఐసీసీ ద్వారా భార‌త్‌ను ఒప్పించ‌డానికి పాక్ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. దీనిపైన ఐసీసీ కూడా చేతులెత్తేసింది. తమ దేశంతో ద్వైపాక్షిక సిరీస్ లో పాల్గొనేలా భారత్ ను ఒప్పించడంలో విఫలమవుతున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)పై పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

2015 నుంచి 2023 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరిగే విధంగా బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య 2014లో ఒప్పందం కుదిరింది. అయితే, ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంతో, పాక్ తో క్రికెట్ ఆడకూడదంటూ భారత్ నిర్ణయించింది. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చాలా నష్టపోయింది. దీంతో, తమతో క్రికెట్ ఆడాల్సిందేనంటూ బీసీసీఐపై పీసీబీ ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయినా, బీసీసీఐ మాత్రం ససేమిరా అంటోంది.

ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ స్పందించాడు. భారత్-పాక్ ల మధ్య మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయని ఆయన చెప్పాడు. అయితే, పాక్ తో ఆడటానికి భారత్ మొగ్గు చూపని పక్షంలో… తమతో ఆడాల్సిందేనంటూ భారత్ పై ఒత్తిడి తీసుకురాకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వ్యవహారాల్లో తలదూర్చే అధికారం ఐసీసీకి కూడా లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఇరు బోర్డుల మధ్య అర్థవంతమైన చర్చలు కొనసాగాలని సూచించాడు.

క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని అన్నాడు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కంటే భారత్-పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ లే ఎక్కువ మజా ఇస్తాయని అక్రమ్ తెలిపాడు. యాషెస్ సిరీస్ ను 2 కోట్ల మంది మాత్రమే చూస్తారని… అదే భారత్, పాక్ లు ఆడితే 100 కోట్ల మంది అభిమానులు చూస్తారని చెప్పాడు.

మరోవైపు ఇదే విషయంపై ఐసీసీ చీఫ్ డేవ్ రిచర్డ్ సన్ కూడా స్పందించాడు. పాక్ తో ఆడటానికి ఇండియా ఆసక్తి చూపకపోతే… తాము ఏమీ చేయలేమని ఆయన స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సిరీస్ లు రెండు బోర్డుల అంగీకారంతో మాత్రమే జరుగుతాయని చెప్పాడు. ఇప్ప‌టికైనా పాక్ త‌న వైఖ‌రి మార్చుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -