Monday, April 29, 2024
- Advertisement -

భారత్ అమ్మాయిని పెళ్లాడనున్న మరో పాక్ క్రికెటర్….

- Advertisement -

భారతీయ అమ్మాయిని పెళ్లాడనున్నాడు మరో పాక్ క్రకిటర్ అసన్ హలీ. ఆగస్టు 20వ తేదీన దుబాయిలోని అట్లాంటిస్‌ పామ్‌ హోటల్‌లో షామియా అర్జుతో హసన్‌ అలీ పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని అతని సన్నిహితుడు తెలిపారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు హాజరు కానున్నారు.

ఇంగ్లండ్‌లో ఇటీవల ప్రపంచ కప్‌ సమయంలో హసన్‌తో షామియా ప్రేమలో పడింది. షమియా మనవ్ రచనా యూనివర్సిటీ నుంచి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. గతంలో జెట్ ఎయిర్‌వేస్‌లో పని చేసిన ఆమె ప్రస్తుతం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఇక హసన్‌ అలీ(25) 53 వన్డేలు ఆడగా.. 82 వికెట్లు తీశాడు. 9 టెస్టు మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు. భారతీయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం హసన్‌ అలీ మొదటి వ్యక్తేం కాదు.

పాక్ క్రికెటర్లు భారతీయ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు.హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను షోయబ్ మాలిక్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జహీర్ అబ్బాస్, మోహ్సిన్ హసన్ ఖాన్‌లు కూడా భారత అమ్మాయిలనే పెళ్లాడారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -