Saturday, May 3, 2025
- Advertisement -

పారాలింపిక్స్‌..భారత్ ఖాతాలో మరో పతకం

- Advertisement -

పారా ఒలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటివరకు 20 పతకాలు గెలవగా తాజాగా మరో మెడల్ వచ్చి చేరింది. పురుషుల షాట్ పుట్ ఎఫ్‌ 46 కేట‌గిరీలో సిల్వ‌ర్ మెడల్ దక్కింది. షాట్ పుట్ లో 16.32 మీటర్ల దూరం విసిరిన సచిన్…సిల్వర్ పతకాన్ని దక్కించుకున్నారు.

స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన వ్యక్తి క‌న్నా కేవ‌లం 0.06 మీట‌ర్ల త‌క్కువ విసిరాడు. పారిస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఇండియాకు ఇది 11వ మెడ‌ల్. పారాలింపిక్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు 21 మెడ‌ల్స్ రాగా 30 ఏళ్ల పారాలింపిక్స్‌లో ఇండియాకు షాట్ పుట్‌లో ప‌త‌కం తొలిసారి లభించింది.

సిల్వర్ మెడల్ సాధించిన స‌చిన్ ఖిలారికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. అతని ప్రతిభకు దేశం గర్విస్తోందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక పారాలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -