Wednesday, May 7, 2025
- Advertisement -

టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం…స్కోరు 87/6

- Advertisement -

దక్షిణాఫ్రికా పర్యటనలో భారత బ్యాట్స్‌మెన్ పేలవ ప్రదర్శన శనివారం కూడా కొనసాగుతోంది. కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్యాట్స్‌మేన్‌లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. స‌ఫారీ ఫేస్ దాటికి భార‌త్ టాప్ ఆర్డ‌ర్ కుప్ప‌కూలింది. ఏద‌శ‌లోనూ పోటీ ఇవ్వ‌లేక చితికిల బ‌డింది టీమిండియా.

తొలి టెస్టులో లంచ్ విరామ సమయానికి 76/4తో నిలిచిన టీమిండియా.. బ్రేక్ తర్వాత తొలి బంతికే చతేశ్వర్ పుజారా (26: 92 బంతుల్లో 5×4) వికెట్ చేజార్చుకుంది. ఆఫ్ స్టంప్‌కి దూరంగా ఫిలాండర్ విసిరిన బంతిని.. పాయింట్ దిశగా నెట్టేందుకు పుజారా ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ డుప్లెసిస్ చేతుల్లో పడింది. దీంతో 76/5తో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో లంచ్ విరామ సమయానికి 76/4తో నిలిచిన టీమిండియా.. బ్రేక్ తర్వాత తొలి బంతికే చతేశ్వర్ పుజారా (26: 92 బంతుల్లో 5×4) వికెట్ చేజార్చుకుంది. ఆఫ్ స్టంప్‌కి దూరంగా ఫిలాండర్ విసిరిన బంతిని.. పాయింట్ దిశగా నెట్టేందుకు పుజారా ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్‌లో ఫీల్డర్ డుప్లెసిస్ చేతుల్లో పడింది. దీంతో 76/5తో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్‌ నైట్ స్కోరు 28/3తో తొలి ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టుకి ఆదిలోనే షాక్ తగిలింది. క్రీజులో తడబడిన రోహిత్ శర్మ (11) జట్టు స్కోరు 57 పరుగుల వద్ద ఔటవగా.. తర్వాత పుజారా, అనంతరం కొద్దిసేపటికే అశ్విన్ (12) కూడా పెవిలియన్ చేరిపోయాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా 11, వృద్ధిమాన్ సాహా 0 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 87/6 (40 ఓవర్లకి) గా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -