Saturday, May 10, 2025
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్‌…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ముందుగా ఆర్సీబీకి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఏకంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకోగా.. ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందిన బెంగళూరు జట్టు‌ నాకౌట్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన సంక్లిష్ట స్థితిలో ఉంది.

ఆర్సీబీ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ పార్థీవ్ పటేల్, హిట్టర్ ఏబీ డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉండటం, గత సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుని దాని సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో మట్టికరిపించడం లాంటి పరిణామాలు బెంగళూరు జట్టులో ఎక్కడలేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. మరోవైపు టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో ప్లేఆఫ్‌కి దూసుకెళ్లిన హైదరాబాద్.. గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడంతో ఒకింత ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -