ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాటింగ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జట్టులో నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చక్కగా సరిపోతాడని తెలిపారు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇప్పటికే నాలుగో స్థానంలో రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లును పరీక్షించినా విఫలం అయ్యారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో మెరుగ్గా ఆడితే.. భారత్ కప్ గెలుస్తుందని పాంటింగ్ తెలిపాడు. ప్రపంచ కప్‌లో రెండో కీపర్‌గా రిషబ్ పంత్ బెటర్ ఆప్షన్ అన్నారు. కోహ్లి, సచిన్‌లలో ఎవరు బెటర్ అనే ప్రశ్నకు పాంటింగ్ తనదైన శైలిలో బదులిచ్చాడు. కోహ్లి కెరీర్ ముగిసేంత వరకు ఈ విషయంలో నిర్ణయానికి రాలేమని చెప్పాడు. సచిన్ ఓ లెజెండ్ అన్న పంటర్.. విరాట్ వేగంగా పరుగులు రాబడుతున్నాడని ప్రశంసించాడు. టెస్టుల్లో కోహ్లి సగటు 50 శాతం పైనే ఉంది. కానీ సచిన్ దాన్ని 200 టెస్టుల్లో నిలబెట్టుకున్నాడన్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు వరల్డ్ కప్ సెమీస్‌కు వెళ్తాయని పాంటింగ్ అంచనా వేశాడు.
- Advertisement -
కోహ్లీ, విరాట్‌లలో ఎవరు బెస్టో చెప్పిన పాంటింగ్…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -