Friday, March 29, 2024
- Advertisement -

టీమిండియా ఫ్యూచర్ స్టార్ ఎవరో చెప్పిన రోహిత్ శర్మ..!

- Advertisement -

టీమిండియా ఫ్యూచర్ స్టార్ ఎవరో చెప్పారు పరిమిత ఓవర్ల వైఎస్ కెఫ్టెన్ రోహిత్ శర్మ. గురువారం హర్భజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ ఎవరో అనే దానిపై స్పందించారు. ’యువ క్రికెటర్ శుభమన్ మంచి బ్యాటింగ్ నైపుణ్యం ఉంది. అతను భారత ఫ్యూచర్ స్టార్.

బ్యాటింగ్‌లో గిల్ నిలకడ సాధించగలిగితే.. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో అతనికి మెరుగైన రికార్డులు ఉన్నాయి. నా అంచనా ప్రకారం త్వరలోనే అతనికి మళ్లీ భారత్ జట్టులో అవకాశం దక్కుతోంది” అని రోహిత్ అన్నారు. నిజానికి గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లోనే శుభమన్ గిల్ కు ఓపెనర్ గా ఛాన్స్ వస్తుందనుకున్నారు.

కానీ అనుకోని విధంగా రోహిత్ ఓపెనర్ గా ఆడటం చెంచరీ చేయడంతో మళ్లీ గిల్ కు ఆడే ఛాన్స్ దక్కలేదు. అయితే ఈ యువ క్రికెటర్ మాత్రం భారత్-ఎ జట్టు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక ధోనీ భవితవ్యంపై రోహిత్ ను ప్రశ్నించగా.. తనకేం తెలియదని.. ఆ విషయం రాంచీలో ఉన్న అతన్నే అడగాలన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -