రోహిత్ శర్మ కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ నుండి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఏమీ లేవు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ నిరాశపర్చాడు రోహిత్. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ రిటైర్మెంట్‌పై వార్తలు వెలువడుతుండగా దానికి బలం చేకూర్చేలా రోహిత్ ఆటతీరు ఉంది.
తాజాగా రంజీ మ్యాచ్‌లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశపర్చాడు రోహిత్. దాదాపు పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాడు రోహిత్. ముంబై తరపున ఆడుతున్న రోహిత్ జమ్మూకశ్మీర్‌తో మ్యాచ్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు.
19 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. అజింక్యా రహానే సారథ్యంలో ముంబై బరిలోకి దిగింది. మొత్తంగా గత 9 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 20 పరుగులు కూడా లేదు అంటే రోహిత్ ఆటతీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.