భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్‌తో కలిసి తన వ్యక్తిగత జీవితం గురించి మనసు విప్పి మాట్లాడారు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత, తన కుమారుడిని ఒంటరి తల్లిగా పెంచుతున్న అనుభవాలు కష్టంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఒంటరి తల్లిగా జీవించడం చాలా కష్టమైన ప్రయాణం అని సానియా మీర్జా పేర్కొన్నారు. ఈ సందర్భంగా, విడాకుల ప్రభావం పిల్లలపై తప్పకుండా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, తన కొడుకు అజహర్‌కు పూర్తి ప్రేమ, మద్దతు ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
గతంలో తనకు పానిక్ అటాక్ వచ్చిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ క్లిష్ట సమయంలో దర్శకురాలు ఫరా ఖాన్ తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పిందని సానియా వెల్లడించారు. సానియా ధైర్యాన్ని, బలాన్ని దర్శకురాలు ఫరా ఖాన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. విడాకుల తర్వాత ఎదురయ్యే సవాళ్లను సానియా మీర్జా ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని ఫరా ఖాన్ కొనియాడారు.
