Friday, May 17, 2024
- Advertisement -

హ‌రిభ‌జ‌న్‌కు గంగూలి క్ష‌మాప‌ణ‌…

- Advertisement -

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి మరో వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ బంధం గురించి తెలియంది కాదు. గంగూలీ సారథ్యంలోనే హర్భజన్ సింగ్ కీలక స్పిన్నర్ గా ఎదిగాడు. ఆ క్రమంలోనే భజ్జీపై గంగూలీ అమితమైన విశ్వాసాన్ని కల్గి ఉండేవాడు. మొత్తంగా చెప్పాలంటే భారత జట్టులో హర్భజన్ ఎదుగుదలలో గంగూలీ పాత్ర వెలకట్టలేనిదనే చెప్పాలి.

బాలీవుడ్ నటి గీతా బస్రాను టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక పాప పుట్టింది. తాగాజా తన భార్య, కుమార్తెతలో కలసి స్వర్ణ దేవాలయం వద్ద దిగిన ఫొటోను భజ్జీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోపై భారత మాజీ కెప్టెన్ స్పందించాడు.

ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి ఫొటోను ట్వీట్ చేశాడు. ‘బాబు ఎంతో అందగా ఉన్నాడు భజ్జీ’అని గంగూలీ ట్వీట్ చేశాడు. ఆపై వెంటనే తాను చేసిన తప్పంటే దాదా గుర్తించాడు.. ‘క్షమించు హర్భజన్.. పాప చాలా అందంగా ఉంది.వయసు మీద పడుతుంది కదా’అని మరో ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ స్పందిస్తూ.. ఆశీస్సులు అందినందుకు ధన్యవాదాలు దాదా. సనాకు ప్రేమతో(గంగూలీ కూతురు).. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నా’అని హర్భజన్ ట్వీట్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -