ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకుంది దక్షిణాఫ్రికా. ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి సెమీస్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది దక్షిణాఫ్రికా.ఆప్ఘాన్ విధించిన 57 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 5 పరుగులకే వెనుదిరిగిన మరో వికెట్ పడకుండా జట్టును గెలిపించారు సఫారీలు. మార్క్‌రమ్ 23 రన్స్,హెండ్రిక్స్ 29 పరుగులు చేశారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ ఏ దశలోనూ పరుగులు చేయలేకపోయింది. ఒక్కొక్కరుగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 56 పరుగులకే ఆలౌట్ అయింది ఆఫ్ఘానిస్తాన్. మార్కో జాన్సెన్, తబ్రేజ్ షంసీ మూడేసి వికెట్లు తీయగా, కగిసో రబాడా 2, అన్రిచ్ నోకియా 2 చొప్పున వికెట్లు పడగొట్టారు.
ఐసీసీ టోర్నీల్లో తొలిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరింది. ఇవాళ జరిగే రెండో సెమీస్‌లో భారత్ -ఇంగ్లండ్ పోరులో గెలిచిన జట్టుతో దక్షిణాఫ్రికా తలపడనుంది.