ఐపీఎల్ 2024 లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచే నాలుగో జట్టు ఏది అనేదానిపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్,సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కి చేరుకున్నాయి. ఇక గురువారం గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఇక హైదరాబాద్ తన చివరి మ్యాచ్‌ను రాజస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2కి చేరుకుంటుంది.
RCB vs CSK మ్యాచ్‌లో బెంగళూరు తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. చెన్నైని కనీసం 18 పరుగుల తేడాతో ఓడించడం లేదా 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ని చేధిస్తే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.
ఇక కోల్ కతా ఆడిన 13 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉండగా రాజస్థాన్ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. ఇక తొలి రెండు స్థానాలు కీలకం ఎందుకంటే. తొలి క్వాలిఫైయర్‌లో ఓడిపోతే వారికి మరో ఛాన్స్ ఉంటుంది. రెండో క్వాలిఫైయర్‌లో గెలిచిన జట్టుతో తలపడి ఫైనల్‌కు చేరే ఛాన్స్. అందుకే రెండో స్థానం కోసం హైదరాబాద్, రాజస్థాన్ మధ్య గట్టి పోటీ నెలకొంది.