Thursday, May 2, 2024
- Advertisement -

చైన్నై సూప‌ర్ కింగ్స్‌కు షాకిచ్చిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

- Advertisement -

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న చైన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు షాకిచ్చింది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. ధోని సేన‌కు ఊహించ‌ని షాకిచ్చింది స‌న్‌రైజ‌ర్స్. బుధ‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో చైన్నై సూప‌ర్ కింగ్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చైన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌కు స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు చుక్క‌లు చూపించారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల ధాటికి చైన్నై 132 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

డుప్లెసిస్ మాత్ర‌మే రాణించాడు. అనంత‌రం 133 ప‌రుగుల ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు శుభారంభం ఇచ్చారు ఓపెన‌ర్లు. వార్న‌ర్‌- బెయిన్‌స్టో అర్ధ సెంచ‌రీల‌తో రాణించి త‌మ జ‌ట్ట‌కు విజ‌యాన్నిందించారు. ఈ మ్యాచ్ విజ‌యంతో త‌మ ఖాతాలో రెండు పాయింట్ల‌ను వేసుకుంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. వెన్నునొప్పి కార‌ణంగా ఈ మ్యాచ్‌లో ధోని ఆడ‌లేదు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌రిగిన మ్యాచ్‌కు సురైశ్ రైనా సార‌థ్య బాధ్య‌త‌లు వ‌హించాడు. ధోనిని చూడ‌టానికి స్టేడియానికి వ‌చ్చి ఆయ‌న అభిమానులు నిరాశ‌తో వెనుదిరిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -