ఐపీఎల్ 12వ సీజన్‌ను ఓటమితో ప్రారంభించింది హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు. కాని వెంటనే ఆ ఓటమి నుంచి తేరుకుని రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతో బోణీ చేసింది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజు సామ్సన్(102).
మొదటి వికెట్ పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు సామ్సన్ మ్యాచ్ చివరి వరకు ఆడి తమ జట్టుకు భారీ స్కోరు సాధించేలా చేశాడు. అజింక్య రహానే ( 70) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం 199 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. వార్నర్ ( 69) అర్ధ సెంచరీ చేయగా,బెయిర్‌స్టో (45), విజయ్ శంకర్ (35) రాణించారు. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణించిన రషీద్ ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు లభించింది. ఈ మ్యాచ్ విజయంతో సన్‌రైజర్స్ జట్టు తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకుంది.
- Advertisement -
దుమ్ముదులిపిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -