Saturday, May 3, 2025
- Advertisement -

టీమిండియా టీ20 సారథిగా సూర్య!

- Advertisement -

రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితుడు కావడంతో కేకేఆర్ మెంటార్‌గా తప్పుకున్నారు గంభీర్. ఈ నేపథ్యంలో ఎనమోషనల్ వీడియో సైతం రిలీజ్ చేశారు.

ఇక బీసీసీ సెలెక్టర్లతో తొలిసారి సమావేశం అయ్యాడు గంభీర్‌. వర్చువల్‌గా సాగిన ఈ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సహా మిగిలిన సెలెక్టర్లు, బీసీసీఐ కార్యదర్శి జైషా పాల్గొన్నారు. భారత జట్టు కూర్పు, భవిష్యత్తుపై సెలెక్టర్లతో గౌతమ్ గంభీర్ చర్చించారు. గంభీర్, సెలెక్టర్ల మధ్య సానుకూలంగా చర్చ జరిగిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ప్రధానంగా శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌ ఎంపిక ప్రస్థావన వచ్చినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‍ల్లో ఎవరి నిమయమించాలన్న విషయంపై చర్చజరిగిందని తెలుస్తోండగా భారత టీ20 టీమ్‍కు సూర్యను కెప్టెన్‍ను చేయాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైస్ కెప్టెన్ బాధ్యతలను హార్థిక్ పాండ్యాకు అప్పజెప్పనున్నారని సమచారాం. శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది టీమిండియా. జూలై 27వ తేదీ నుండి టీ20లు ప్రారంభంకానుండగా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -