Saturday, May 3, 2025
- Advertisement -

ఛాంపియన్స్‌ ట్రోఫీ..భారత జట్టు ఇదే

- Advertisement -

ఫిబ్రవరి 19 నుండి చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడ్‌లో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా గిల్ వైస్ కెప్టెన్‌గా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే హైదరాబాదీ స్టార్ బౌలర్ సిరాజ్‌కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు.

ఫిబ్ర‌వ‌రి 6 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు ఇదే జ‌ట్టు కొన‌సాగుతుంద‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. ఇంగ్లాండ్‌తో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్ ఆడ‌నుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో 8 దేశాలు పాల్గొంటుండగా . భార‌త్ తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు గ్రూపు-ఏలో ఉన్నాయి.

భారత మ్యాచ్‌ల షెడ్యూల్‌ వివరాలను పరిశీలిస్తే భార‌త్ తొలి మ్యాచ్‌ను ఫిబ్ర‌వ‌రి 20న బంగ్లాదేశ్‌తో ఆడ‌నుంది. భార‌త్‌, పాకిస్థాన్ జట్ల మ‌ధ్య మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 23న జ‌ర‌గ‌నుంది. మార్చి 2న భార‌త్ న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్ (వైస్‌కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్, కుల్‌దీప్ యాదవ్‌, జ‌స్ ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్‌,రవీంద్ర జడేజా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -