ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన నోటికి పని చెప్పాడు.పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రసతవత్తరంగా మారింది.విజయం కోసం రెండు జట్లు నువ్వా, నేనా అన్నట్లు పోరాటం చేస్తున్నాయి.దీనిలో భాగంగా సోమవారం ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.వివాదాస్పద రీతిలో ఔటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన నోటికి పనిచెప్పాడు.
మూడో రోజు ఆటలో భాగంగా ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌పై నోరుపారేసుకున్నాడు.పలుమార్లు ఔటవ్వకుండా తప్పించుకున్న పైన్ దగ్గరకు వెళ్లి.. ‘మీరు ఇలా ఆడితే సిరీస్ 2-0గా మారుతుంది’ అని హెచ్చరించాడు.దీనికి పైన్ సైతం అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీరు ముందు బ్యాటింగ్ చేయాల్సింది కదా బిగ్‌హెడ్’ అని కోహ్లి మాటలను తిప్పి కొట్టాడు. ఇవి స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -
కోహ్లి, పైన్‌ల మధ్య మాటల యుద్దం
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -