- Advertisement -
వరుస సినిమాలతో రాశి ఖన్నా బిజీగా ఉంది. సక్సెస్ లతో సంబంధం లేకుండానే సినిమా అవకాశాలను చేజిక్కించుకుంటోంది. ఇదే సమయంలో టీమిండియా క్రికెట్ర్ బుమ్రాను రాశి పెళ్లీ చేసుకోనుందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి.
బుమ్రాతో పెళ్లి విషయంపై తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో స్పందించింది. ఈ ప్రశ్న అడిగినందుకు చాలా థ్యాంక్స్. అతను ఒక క్రికెటర్ అని మాత్రమే తెలుసు. అంతకుమించి ఏమీ లేదు. అతని మ్యాచ్‌లు అస్సలు ఎప్పుడూ చూడలేదు. వ్యక్తిగా అతనెవరో కూడా తెలియదు. ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కొన్ని హిందీ వెబ్‌సైట్‌లు చేసిన పని ఇది. ఇలాంటివి వింటుంటే చాలా చిరాగ్గా ఉంటుంది.